హెచ్‌-1బీ వీసాలు మరింత కఠినం

- November 16, 2017 , by Maagulf
హెచ్‌-1బీ వీసాలు మరింత కఠినం

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ జారీ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన అత్యున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర వేసింది. ఇది చట్టరూపంలోకి రావాలంటే తొలుత ప్రతినిధుల సభ, అనంతరం సెనేట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేస్తే దాన్ని చట్టరూపంలోకి తీసుకొస్తారు. ఈ చట్టం ప్రకారం హెచ్‌-1బీ వీసాలపై వస్తున్న నిపుణులకు ఇస్తున్న కనీస వేతనాన్ని కంపెనీలు 60వేల డాలర్లు నుంచి 90వేల డాలర్లుకు పెంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్‌1బీ వీసాదారులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు కూడా వివిధ షరతులు వర్తించనున్నాయి. అమెరికన్ల స్థానంలో హెచ్‌1బీ వీసాలదారులను నియమించే విధానాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది.
దీంతో పాటు భారత్‌ నుంచి వస్తున్న ఐటీ నిపుణులకు పలు ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును పొందుపరిచింది. ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌(హెచ్‌ 170) కింద ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ బిల్లు ద్వారా అమెరికన్ల ఉద్యోగులను భర్తీ చేయకుండా.. హెచ్‌-1బీ వీసాదారులను నియమించడాన్ని అడ్డుకుంటారు. అమెరికా ఉద్యోగులను రక్షిస్తూ.. కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు ఇది దోహదపడుతోందని కాంగ్రెస్‌ నేత ఇస్సా అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే.. ఈ చట్టాన్ని నాస్కామ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయని చెబుతోంది. ఈ చట్టం అమెరికా వ్యాపారానికి హాని చేస్తుందని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com