ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...
- November 16, 2017
చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు కానీ, ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం ససేమిరా అంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.
నిజానికి సూర్యోదయం కంటే ముందు నిద్రలేవడం వల్ల ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు. కానీ, అలా నిద్రలేవడమే చాలా కష్టంగా భావిస్తుంటారు. నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు.
అలాగే, ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల నిద్ర మత్తు వదిలిపోతుంది. పైగా, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజసిద్ధమైన శక్తి అందుతుంది.
నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్, వాకింగ్లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది.
తాజా వార్తలు
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!