భారత్ లో పాగాకు ఐసిస్ యత్నం, గల్ఫ్ నుంచి భారీగా నిధులు
- November 17, 2017
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో క్రమంగా ప్రాబల్యం తగ్గిపోవడంతో... ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్ను మన దేశంపై పడింది. ప్రపంచంలోని పలు దేశాల్లో నెత్తుటి ఏర్లు పారించిన ఐసిస్... ఇప్పుడు భారత్ లో పాగా వేసేందుకు యత్నిస్తోంది.
ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థ మనదేశంలోని కేరళను టార్గెట్ చేస్తోంది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తూ.. భారత్ లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తోంది.
ఈ క్రమంలో భారత్ కు నిధులను తరలించేందుకు ఈ ఉగ్రవాద సంస్థ హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు.. ఐసిస్ ప్రణాళికలను భగ్నం చేశారు.
ఐసిస్ సానుభూతిపరులపై మెరుపుదాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గల్ఫ్ దేశాల నుంచి హవాలా రూపంలో తస్లీం అనే వ్యక్తికి డబ్బు వస్తోందని, అతడి వద్ద నుంచి ఐసిస్ సానుభూతిపరులకు పంపిణీ అవుతోందని పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







