మూడు రోజుల పాటు బ్రిటన్ పర్యటనకు బయలుదేరిన మోడీ
- November 11, 2015
ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మూడు రోజుల పాటు యునైటెడ్ కింగ్డమ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బ్రిటన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. బ్రిటన్ పారిశ్రామిక వేత్తలతో మోడీ సమావేశమవుతారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ల్యాండ్ రోవర్ ప్లాంట్‌ను నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. టర్కీలో జరిగే జి-20 సదస్సుకు మోడీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







