4.5 కేజీలు బంగారంతో పట్టుబడిన మహిళ
- November 11, 2015
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేసి.. ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బ్యాంకాక్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చిన మహిళను తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు సోదా నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు ప్రయాణికురాలి నడుముకు బంగారపు బిస్కెట్లు చుట్టుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బంగారపు బిస్కెట్లు స్వాధీనం చేసుకుని.. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బంగారం 4.5 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మహిళ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరం అని చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







