టెస్టింగ్ దశలో 'ట్వీట్ స్ట్రామ్'.!
- November 18, 2017
ట్విటర్‌లో 140 అక్షరాలు సరిపోవడం లేదని... ఇటీవల ఆ సంఖ్యను 280కి మార్చారు. అయినా కొందరికి అది కూడా సరిపోదు. అలాంటి వాళ్ల కోసం 'ట్వీట్ స్ట్రామ్' పేరుతో ట్విటర్ కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎంత పెద్ద సందేశానైనా ట్వీట్ చేసుకోవచ్చు. అయితే ఆ సందేశం 280 అక్షరాల చొప్పున విడిపోయి వరుసలో పోస్ట్ అవుతుంది. వాటికి సీరియల్ నెంబర్ కూడా వస్తుంది. ఈ తరహా ఆప్షన్‌ను చాలా రోజుల నుంచి కొన్ని థర్డ్‌పార్టీ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఇకపై వాటి అవసరం లేకుండా ట్విటర్ నేరుగా ఈ ఆప్షన్‌ను అందిస్తోంది.
ప్రస్తుతం 'ట్వీట్ స్ట్రామ్' ఫీచర్ మన దేశంలో కొందరికి ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. త్వరలో అందరూ వినియోగించొచ్చు. దీని ద్వారా ట్వీట్ రాసుకున్నాక... పోస్ట్ కొడితే కాస్త సమయం తీసుకొని దానంతట అదే వివిధ ట్వీట్లుగా విడిపోయి పోస్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్‌ను చూపించే ఓ ఇమేజ్ ద్వారా ఈ విషయం బయటికొచ్చింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష