రవిప్రకాష్ - కొడాలి నాని - ఎన్టీవీ చౌదరి : '11 మీడియా'

- November 19, 2017 , by Maagulf
రవిప్రకాష్ - కొడాలి నాని - ఎన్టీవీ చౌదరి : '11 మీడియా'

సంచలనకరమైన ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటి అంటే తెలుగు మీడియా రంగాన్ని శాసించే ఇద్దరు డైరెక్టర్లు మరియు ఒక రాజకీయ నేత కలిసి ఒక కంపెనీని రిజిస్టర్ చేశారు . నువ్వా నేనా అన్నట్టు నడిచే రెండు టీవీ ఛానల్ల డైరెక్టర్లు కలిసి కంపెనీ పేట్టడం చర్చకు దారితీస్తోంది . తెలుగు మీడియా రంగంలో టీవీ 9 మరియు ఎన్ టీవీ లు నువ్వానేనా అన్నట్టుగా ఉంటాయి రేటింగ్ విషయంలో. ఒక్కో వారం ఆయా ఛానల్స్ ప్రత్యర్థులు తలదించుకునేలా కార్యక్రమాలు ప్రసారిస్తారు . అటువంటి న్యూస్ చానల్స్ కలిగిన డైరెక్టర్లు కలసి ఎలవన్ మీడియా లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరో తెలుసా .. టీవీ 9 న్యూస్ ఛానల్ రవి ప్రకాష్ .. మరియు యాన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి వెంకటేశ్వర్లు ఉన్నారు. అసలు కంపెనీ స్టార్ట్ చేయడం వెనుక అసలు గుట్టు ఏంటి అని ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మీడియా ప్రముఖుల సమాచారం ప్రకారం త్వరలో కొత్త తెలుగు ఛానల్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారంట. ఎన్నికల వేడిలో కొత్త ఛానల్ తీసుకువస్తే టైమింగ్ పరంగా ఎదురు ఉండదని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే వీరు ప్రారంభించే కంపెనీలో ఒక యువ ఎ౦ పి కూడా చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కలయికలో మీడియా రంగంలో ఛానల్ రావటం సంచలనం అవుతుంది అని మరికొందరు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com