చిన్ననాటి స్నేహితుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకొన్న రిచా గంగోపాధ్యాయ

- November 20, 2017 , by Maagulf
చిన్ననాటి స్నేహితుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకొన్న రిచా గంగోపాధ్యాయ

రిచా గంగోపాధ్యాయ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. మిరపకాయ్, మిర్చి వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకొన్న రిచా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. కెరీర్ బిజీగా ఉన్న సమయంలో సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. అమెరికా చెక్కేసిందీ సుందరి. వాషింగ్టన్ యూనివర్సిటీలో మూడేళ్లపాటు చదివి ఎంబీఏ డిగ్రీ పట్టాను పుచ్చుకున్నది. చదువు పూర్తి చేసుకొన్నది కనుక రిచా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని అందరూ భావించారు. కానీ తనకు మళ్ళీ సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని రిచా చెప్పింది.. కాగా తాజాగా రిచా గంగోపాధ్యాయ ఓ ఇంటిది అయ్యింది అనే టాక్ వినిపిస్తోంది. రిచా తన చిన్ననాటి స్నేహితుడిని అమెరికాలో పెళ్లిచేసుకొన్నదట.. ఈ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య, ఇరు కుటుంబాల మధ్య సింపుల్ గా జరిగింది అనే టాక్. రిచా ఇక యూఎస్ లోనే సెటిల్ కానున్నది అని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com