'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ఫస్ట్‌లుక్
- November 20, 2017
ముంబయి: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్‌లుక్‌లో టైటిల్‌పై టైగర్ స్టైల్‌గా పడుకున్నట్లుగా చూపించారు.
పునిత్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, ఆలియా భట్ నటించారు.ఇప్పుడు సీక్వెల్‌లో టైగర్‌కి జోడీగా ఎవరు నటిస్తున్నారన్నది ఇంకా వెల్లడించలేదు.
తొలి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహారే ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాక్స్‌స్టార్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2018 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







