ఆరాధ్య పుట్టినరోజు వేడుకల్లో అబ్రం సందడి

- November 20, 2017 , by Maagulf
ఆరాధ్య పుట్టినరోజు వేడుకల్లో అబ్రం సందడి

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయుడు అబ్రం పీచు మిఠాయి కోన్ కావాలని అడిగాడట. అప్పుడు షారుఖ్‌తో ఉన్న బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్టాల్‌కి తీసుకెళ్లి అబ్రంకి కోన్ కొనిచ్చారట. ఈ విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "అబ్రం, జూనియర్ షారుఖ్.. తనకు పీచు మిఠాయి కోన్ కావాలని అడిగాడు. కాబట్టి మేము స్టాల్‌కి తీసుకెళ్లి ఓ కోన్‌ని తయారు చేయించి ఇచ్చాము. అది తీసుకున్న వాడి ఆనందం వెలకట్టలేనిది." అని బిగ్‌బీ ట్వీట్ చేశారు. దీనిపై షారుఖ్ కూడా స్పందించారు. "థాంక్యూ సర్. ఈ మూమెంట్‌ని తను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాడు. మిమ్మల్ని టీవీలో చూసినపుడు మీరు నా తండ్రి అని వాడు భావిస్తాడు." అని ట్వీట్ చేశారు షారుఖ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com