ఇకపై ఆరోగ్య ప్రత్యేక కేంద్రాలలో నగదు ఇవ్వకుండా కె నెట్ ద్వారా చెల్లింపులు
- November 20, 2017
కువైట్ : కె నెట్ సౌకర్యంను కువైట్ ప్రభుత్వం త్వరలో ఆమోదించనుంది. ఇకపై అన్ని ఆసుపత్రులలో, ఆరోగ్య, ప్రత్యేక కేంద్రాలలో ఎటువంటి నగదు ఇవ్వకుండా కె నెట్ సహాయంతో ఆరోగ్య ఫీజులను చెల్లించవచ్చని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఫీజు వసూలు చేయటానికి మార్గదర్శకత్వం వహిస్తోంది. ప్రత్యేకించి సాయంత్ర సమయంలో ఆరోగ్య సౌకర్యాలలో అకౌంటింగ్ సిబ్బంది సహాయం ఉండదు కనుక ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. కె నెట్ ఆటోమేటెడ్ ప్రాధమిక సంరక్షణ కల్గి ఉండటమే కాక ఆసుపత్రులతో ఆటోమేటెడ్ సిస్టమ్ తో తక్షణమే అనుసంధానించబడి ఉంటుంది. మంత్రిత్వ శాఖ తొలిదశలో ప్రయోగాత్మకంగా కె నెట్ ఏర్పాటు పరిశీలించింది. అది విజయవంతం కావడంతో, 30 యంత్రాల ఏర్పాటుచేసింది. ప్రవాసీయులకు ఆరోగ్య రుసుము పెంచాలని నిర్ణయం వెలువడిన తర్వాత ఈ చర్యలు తీసుకుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!