సౌదీ అరేబియా ఎడారిలో వింత రాతి కట్టడాలు

- November 20, 2017 , by Maagulf
సౌదీ అరేబియా ఎడారిలో వింత రాతి కట్టడాలు

రియాద్: ' ఈ నల్లని రాళ్ళలో..ఏ కన్నులూ దాగినో ...ఈ బండల మాటున... ఏ గుండెలు మోగినో '  అంటూ  సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు అమరశిల్పి జక్కన మాదిరిగా కూనిరాగాలు తీస్తున్నారు. వారి ఆసక్తికి అసలు  కారణమేమిటంటే...ఎటూ చూసినా భారీ ఇసుక గుట్టలు..మొక్క మోడు మొలవని ఆ  సౌదీ అరేబియా ఎడారిలో కొన్ని రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో పేర్చబడిన నిర్మాణాలు వారికి ఎంతో వింతను కలిగిస్తున్నాయి. అవి ఏమిటో తెలియక సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పెట్టుకొంటున్నారు. ఈ రహస్యం కనిపట్టేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ, ఆ మిస్టరీ వీడటం లేదు. ఇక వారికి అంతర్జాలంలో గూగుల్ తల్లి  శరణమైంది. గూగుల్ మ్యాపింగ్ ద్వారా వాటిని గుర్తించారు. ఏవో రాళ్లు శ్రద్ధగా పేర్చినట్లు కనపడుతున్న ఆ ఆకారంలో ఏదో దేవ రహస్యం దాగుందని..అవి ఏ కాలానికి చెందినవని... ఆ రాళ్ళ వరుసలను పేర్చినవారు  ఎవరై ఉంటారో తేల్చుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేవిడ్ కెన్నడీ అనే ప్రముఖ పురాతత్వవేత్తను అధికారులు ప్రత్యేకంగా సౌదీకి రప్పించారు. ఆయన  తన బృందం సహయంతో ఆ నిర్మాణాలపై పరిశోధనలు జరిపారు. ఆ రాళ్లు 9 వేల ఏళ్ల క్రితం అలా పేర్చాబడ్డాయని కెన్నడీ తేల్చేశారు. అయితే అవి ఆనాటి మానవుల సమాధులు అయి ఉండవచ్చని కెన్నడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com