చైనా: ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్
- November 20, 2017
సుదూర లక్ష్యాలను చేదించగల క్షిపణిని చైనా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దంచేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ను వచ్చే ఏడాదికళ్లా పూర్తిచేయనున్నట్లు చైనా మీడియా తెలిపింది. బహుళ అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ మిస్సైల్ ....ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. డాంగ్ఫెన్గ్ 41 అనే కొత్త క్షిపణి మాచ్ టెన్ కంటే అత్యంత వేగవంతమైంది. ఇది శత్రుదేశాల మిస్సైల్ హెచ్చరికలను పసిగడుతూనే దూసుకుపోతుంది. అయితే దీని రూపకల్పనకు చైనా పీఫుల్స్ లిబరేషన్ ఆర్మీ 2012లోనే ప్రకటించింది. 2018 ప్రధమార్ధంలో దీన్ని పూర్తిచేయనుంది. మూడు రకాల ఇందనాన్ని ఉపయోగించుకోగల సామర్ధ్యం ఉన్న ఈ డాంగ్పెన్గ్ 41 క్షిపణి, 12వేల కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను సునాయాసంగా చేదించగలదు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం