కువైట్‌లో ఆంధ్ర మహిళకు చిత్రహింసలు
- November 20, 2017
కువైట్: ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ యజమాని చేతుల్లో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కువైట్ నుంచి ‘చింతలమోరి నేటి పౌరుల సంఘం’ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన నల్లి పద్మ ఉపాధి నిమిత్తం 2011లో కువైట్ వెళ్లింది. ఏడాదిపాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేది. అయితే 2012 నుంచి పద్మ ఫోన్ చేయడం లేదు. దీంతో ఆమె చనిపోయిందని వారు భావించారు.
కానీ పద్మ తీవ్ర గాయాలపాలై సోమవారం కువైట్‌లోని అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రవాసాంధ్రులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఆమె కుటుంబీకులకు తెలియజేశారు. పద్మను ఇంట్లో యజమాని చిత్రహింసలు పెట్టేవాడని అక్కడి వారు చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు సాయం చేసి స్వదేశం తీసుకురావాలని ‘నేటి పౌరుల సంఘం’ సభ్యులు కృషి చేస్తున్నారని, భారత ప్రభుత్వం కూడా సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









