రస్‌ అల్‌ ఖైమాలో ఏషియన్ కార్మికుడి సజీవ సమాధి

- November 21, 2017 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలో ఏషియన్ కార్మికుడి సజీవ సమాధి

రస్‌ అల్‌ ఖైమా: 30 ఏళ్ళ కార్మికుడొకరు సజీవ సమాధి అయిన ఘటన రస్‌ అల్‌ ఖైమాలో చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, ల్యాండ్‌స్లైడ్‌ చోటు చేసుకుని, కార్మికుడు అందులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో బాధితుడ్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ జాబి మాట్లాడుతూ, ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరిని తమ రెస్క్యూ టీమ్స్‌ రక్షించాయని చెప్పారు. ఉదయం 10.35 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, ఆ వెంటనే అంబులెన్స్‌, పారా మెడిక్స్‌, రెస్క్యూ టీమ్స్‌ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు మొహమ్మద్‌ అబ్దుల్లా. ఇద్దరు వ్యక్తుల్ని రెస్క్యూ టీమ్స్‌ రక్షించగలిగాయనీ, వారికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఓ వ్యక్తిని మాత్రం కాపాడలేకపోయామని చెప్పారు. చట్ట పరమైన చర్యల నిమిత్తం రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సంబంధిత శాఖలకు ఈ కేసును రిఫర్‌ చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com