భారత్ మాకు గొప్ప మిత్రదేశం: ఇవాంకా ట్రంప్
- November 21, 2017
వాషింగ్టన్: భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు-2017 రెండు దేశాల మధ్య 'దృఢమైన స్నేహబంధం'కు నిదర్శనమని ఇవాంకా ట్రంప్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 28 నుంచి 30 వరకు నిర్వహించే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, అమెరికా వాణిజ్య బృందం నాయకురాలి హోదాలో ఆయన కుమార్తె ఇవాంకా ముఖ్య అతిథిగా వస్తున్నారు.
వాషింగ్టన్లో థ్యాంక్స్ గివింగ్ వేడుక తర్వాత ఇవాంకా ట్రంప్ మీడియాతో శిఖరాగ్ర సదస్సు గురించి మాట్లాడారు. ఇది భారత్, అమెరికా మధ్య దృఢమైన స్నేహబంధానికి చిహ్నంగా పేర్కొన్నారు. తొలిసారి 'మహిళలు ముందు.. అందరికీ శ్రేయస్సు' అన్న థీమ్‌తో సదస్సు నిర్వహిస్తుండటం మహిళల ఆర్థిక సాధికారతను సూచిస్తోందని పేర్కొన్నారు. తన పర్యటన విజయవంతం అవుతుందని తెలిపారు.
'భారత్ మాకు గొప్ప మిత్రదేశం. భాగస్వామి. భద్రత, ఆర్థిక రంగాల్లో మెరుగవ్వడం మా భాగస్వామ్య ప్రధాన లక్ష్యం' అని ఇవాంకా అన్నారు. 'ది ప్లీనరీ సెషన్: మార్పు..
మహిళల వ్యాపార నాయకత్వం', 'బ్రేకౌట్ సెషన్: మానవ వనరుల అభివృద్ధిలో సృజన, నైపుణ్య శిక్షణ మనమూ చేయగలం!' అనే రెండు ప్యానళ్లలో ఇవాంకా పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం