తిరుపతి-నాగర్‌సోల్ ప్రత్యేక రైళ్లు వయా గుంటూరు
- November 21, 2017
గుంటూరు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరుపతి - నాగర్‌సోల్ - తిరుపతి ప్రత్యేక రైళ్లను గుంటూరు డివిజన్ మీదగా నడపనున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07417 తిరుపతి-నాగర్‌సోల్ ప్రత్యేక రైలు డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 7.30గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15కు గుంటూరు వచ్చి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, సికింద్రాబాద్ మీదగా మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు నాగర్‌సోల్ చేరుకొంటుంది.
నెంబర్ 07418 నాగర్‌సోల్ - తిరుపతి ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో (శనివారం) రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు వచ్చి సోమవారం వేకువజామున 4 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, మూడు త్రీటైర్, ఎనిమిది స్లీపర్‌క్లాస్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్ భోగీలు ఉంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం