భారత్‌ మాకు గొప్ప మిత్రదేశం: ఇవాంకా ట్రంప్

- November 21, 2017 , by Maagulf
భారత్‌ మాకు గొప్ప మిత్రదేశం: ఇవాంకా ట్రంప్

వాషింగ్టన్‌: భారత్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు-2017 రెండు దేశాల మధ్య 'దృఢమైన స్నేహబంధం'కు నిదర్శనమని ఇవాంకా ట్రంప్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 28 నుంచి 30 వరకు నిర్వహించే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, అమెరికా వాణిజ్య బృందం నాయకురాలి హోదాలో ఆయన కుమార్తె ఇవాంకా ముఖ్య అతిథిగా వస్తున్నారు.
 
వాషింగ్టన్‌లో థ్యాంక్స్‌ గివింగ్‌ వేడుక తర్వాత ఇవాంకా ట్రంప్‌ మీడియాతో శిఖరాగ్ర సదస్సు గురించి మాట్లాడారు. ఇది భారత్‌, అమెరికా మధ్య దృఢమైన స్నేహబంధానికి చిహ్నంగా పేర్కొన్నారు. తొలిసారి 'మహిళలు ముందు.. అందరికీ శ్రేయస్సు' అన్న థీమ్‌తో సదస్సు నిర్వహిస్తుండటం మహిళల ఆర్థిక సాధికారతను సూచిస్తోందని పేర్కొన్నారు. తన పర్యటన విజయవంతం అవుతుందని తెలిపారు.

'భారత్‌ మాకు గొప్ప మిత్రదేశం. భాగస్వామి. భద్రత, ఆర్థిక రంగాల్లో మెరుగవ్వడం మా భాగస్వామ్య ప్రధాన లక్ష్యం' అని ఇవాంకా అన్నారు. 'ది ప్లీనరీ సెషన్‌: మార్పు..

మహిళల వ్యాపార నాయకత్వం', 'బ్రేకౌట్‌ సెషన్‌: మానవ వనరుల అభివృద్ధిలో సృజన, నైపుణ్య శిక్షణ మనమూ చేయగలం!' అనే రెండు ప్యానళ్లలో ఇవాంకా పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com