సౌదీఅరేబియా ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు
- November 24, 2017
సౌదీ అరేబియా: ముస్లిమ్ల పుణ్యక్షేత్రాలైన మక్కా, మదీనాల ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ సౌదీఅరేబియా సర్కారు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఇస్లాం ప్రకారం పుణ్యక్షేత్రాలైన మక్కా మదీనాల ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు సౌదీ సర్కారు తాజాగా ప్రకటించింది. మక్కాలోని కాబా గృహంతోపాటు మదీనాలో ఈ-నబవీ మసీదు ఫోటోలు, వీడియోలను మీడియాతో సహా ఎవరూ తీయరాదని సౌదీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. పుణ్యక్షేత్రాలైన మక్కా, మదీనాలను సందర్శిస్తున్న భక్తులకు అసౌకర్యంగా కలగకుండా ఈ నిషేధాన్ని విధించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు వారి కెమెరాలను సీజ్ చేస్తామని సర్కారు హెచ్చరించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







