ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు..
- November 24, 2017
హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నవంబరు 28న తెల్లవారుజామున 3.30కి ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఆమె వెంట ప్రైవేట్ కమర్షియల్ ప్లైట్ లో వందమంది ప్రతినిధులు రానున్నారు. శంషాబాద్ నుంచి మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. ఉదయం 9.30కి హెచ్ఐసీసీలో ప్రతినిధులతో సమావేశం కానున్న ఇవాంక.. సాయంత్రం 4.30కి ప్రధాని మోడీతో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.. అనంతరం మోడీతో కలిసి సాయంత్రం 6.30కి ఫలక్ నుమా ప్యాలెస్ లో డిన్నర్ లో పాల్గొంటారు. డిన్నర్ అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి వెస్టిన్ హోటల్ కు వస్తారు. మరుసటి రోజు 29వ తేదీ ఉదయం 9.30కి హెచ్ఐసీసీ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం గోల్కొండను సందర్శించనున్న ఇవాంక.. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు.
అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు వెస్టిన్ హోటల్ కు చేరుకుని .. రాత్రి 9.30కి శంషాబాద్ నుంచి ఫ్లైట్ లో అమెరికాకు తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







