అలెర్ట్: 15 కీలక ప్రాంతాలలో అనుదాడులకు కిమ్ ప్లాన్
- November 24, 2017
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా అణు దాడులు జరపాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. ఈ విషయం వెలుగు చూడడంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రెండు మాసాలుగా ఎలాంటి కవ్వింపుచర్యలకు పాల్పడడం లేదని వార్తలు వచ్చిన వారం రోజులకే అణుదాడులకు సంబంధించి కిమ్ రూపొందించిన ప్లాన్ బట్టబయలు కావడం ఆందోళన కల్గించేదిగా ఉంది. ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జంగ్ ఉన్ వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించారు.
ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అణు దాడులు చేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అణుదాడులకు పాల్పడాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది.
ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్ సాయంతో ఈ సమాచారం సంపాదించగలిగినట్లు యూరోపియన్ కమిషన్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్(ఈయూఎఫ్ఆర్) వివరించింది. అమెరికాలోని వైట్‌హౌస్, పెంటగాన్, న్యూయార్క్, మన్హట్టన్తో పాటు అమెరికా ముఖ్య నగరాలలో అణుదాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జపాన్లోనిమిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో నగరాలపై దాడులు చేయాలని ఉత్తరకొరియా ప్లాన్ చేసింది.దక్షిణ కొరియాలోని సియోల్, బుసాన్, గ్యాంన్నెయంగ్ ప్రాంతాల్లో కిమ్ జంగ్ ఉన్ దాడులు చేసే అవకాశం ఉందని ఈ నివేదిక అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







