మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్..

- November 24, 2017 , by Maagulf
మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్..

ఇంతకు ముందు అన్నయ్య సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లి పోయాడు. కానీ ఈ సినిమాల్లో పది నిమిషాలకు పైగా స్క్రీన్‌పై కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఇప్పటికే ముహుర్తం ముగించుకున్నా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ చిత్రంలోని నటీనటులంటూ రోజుకొకరు తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం పవన్ కళ్యాణ్‌ని సంప్రదించింది చిత్ర యూనిట్. విజయ్ సేతుపతి, నాజర్ వంటి మహామహుల ఎంపిక జరిగింది. ఈ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com