పద్మావతి: స్పందించిన ఉపరాష్ట్రపతి

- November 25, 2017 , by Maagulf
పద్మావతి: స్పందించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : ఓవైపు పద్మావతి చిత్ర వివాదం కొనసాగుతున్న వేళ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. న్యూఢిల్లీలో శనివారం ఓ సాహితి వేడుకలకు హాజరైన ఆయన.. చిత్రం పేరును ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. 

హిందుస్థాన్‌ టైమ్స్‌ కథనం ప్రకారం ఆయన ప్రసంగం ఇలా ఉంది...మనుషులను చంపుతామని.. వారిపై రివార్డులను ప్రకటించటం ప్రజాస్వామిక వ్యవస్థ అంగీకరించబోదు. సినిమాలు-కళలు అనేవి దేశానికి అవసరమన్న ఆయన.. వాటి విషయంలో బెదిరింపులను చట్టాలు ఊపేక్షించబోవు.‘‘మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు నిరసనలు ప్రదర్శిస్తున్నారు. వాళ్ల దగ్గర అంత డబ్బు ఉందో లేదో తెలీదుగానీ.. కోటికి తక్కువ కాకుండా రివార్డు ప్రకటిస్తున్నారు. కోటి రూపాయలు అంటే అంత తేలికగా వాళ్లు భావిస్తున్నారా? అని వెంకయ్యనాయుడు చురకలంటించారు.

ప్రజాస్వామ్య దేశంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని.. కానీ, అది హింసాత్మక ధోరణితో ఉండకూడదని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఆయన హారామ్‌ హవా, కిస్సా కుర్సీ కా, ఆనంది చిత్రాల పేర్లను ఆయన ప్రస్తావించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com