మందుపాతర మీద అడుగువేసిన 8 ఏళ్ళ బాలిక

- November 26, 2017 , by Maagulf
మందుపాతర మీద అడుగువేసిన 8 ఏళ్ళ బాలిక

కువైట్ :  26 ఏళ్ళ క్రితం నాటి ఓ ఇరాకీ మందుపాతరపై ఎనిమిదేళ్ల బాలిక చూసుకోకుండా కాలు మోపడంతో అది ఒక్కసారిగా పేలడంతో  ఆమె తీవ్రంగా గాయపడింది. అత్యవసర ఫోన్ పిలుపునకు ప్రతిస్పందనగా ప్రమాదస్థలానికి  చేరుకున్న పారామెడిక్స్ సిబ్బంది ఆ పాపను ఫర్వాణీయ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కాగా  1990/91 ప్రాంతంలో ఇరాక్ దండయాత్ర నాటి మందుపాతర అని ఒక పరిశోధనలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com