ఇవాంక రెండోరోజు షెడ్యూల్ లో గోప్యత
- November 28, 2017
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు కుమార్తె, వైట్ హౌజ్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాల్టి టూర్ షెడ్యూల్లో గోప్యత పాటిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఇవాంక ఏం చేయబోతున్నారు?.. ఎక్కడికి వెళ్లబోతున్నారు అన్నదానిపై సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇవాంక రెండో రోజు పర్యటన షెడ్యూల్ ఈరోజు ఉదయమే ప్రారంభంకానుంది. ఉదయం అమెరికా ప్రతినిధులతో కలిసి ట్రైడెంట్ హోటల్లో ఇవాంక బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఆ తరువాత 10 నుంచి 12 గంటల మధ్య హెచ్ఐసీసీలో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. కొన్ని డిబెట్లలో ప్యానెలిస్టుగా ఉంటారు.
మధ్యాహ్నం 12గంటలకు ట్రైడెంట్ హోటళ్లోనే భోజనం ముగించి అమెరికన్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం ఆమె హోటల్ నుంచి బయటకు వెళతారు. భద్రతాకారణాల రీత్య ఇవాంక ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. సుమారు ఐదు గంటల పాటు ఆమె షెడ్యూల్‌ను రహస్యంగా ఉంచుతున్నారు. రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుని 9:20గంటలకు ఫ్లైటెక్కి దుబాయ్ బయలుదేరతారు. దీంతో ఇవాంక రెండు రోజుల పర్యటన ముగుస్తుంది. ఇవాల్టి ఇవాంకా షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత రావడం లేదు. మధ్యాహ్నం షెడ్యూల్‌ను రహస్యంగా ఉంచుతున్నారు. ఆ సమయంలో ఆమె నగరంలో ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు అంచనాకు వస్తున్నారు. అయితే ఇప్పటికే అమెరికన్ సీక్రెట్ ఏజెంట్ల నుంచి నగర పోలీసులకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
పోలీసు అధికారులు మాత్రం ఈ అన్‌షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కనీసం 3, 4 గంటల ముందు తమకు సమాచారం ఇవ్వాలని అమెరికా అధికారులను కోరారు. ఇవాంకా వెళ్లే మార్గం క్లియర్ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లకు ఈ సమయం పడుతుందని పోలీసులు వివరించారు. ఇవాంకా రహస్య షెడ్యూల్ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









