సకాలంలో చెల్లించకపోతే 25 దిర్హామ్‌ల జరీమానా: ఎటిసలాట్‌

- November 29, 2017 , by Maagulf
సకాలంలో చెల్లించకపోతే 25 దిర్హామ్‌ల జరీమానా: ఎటిసలాట్‌

యూఏఈ:సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి యూఏఈ టెలికాం సంస్థ ఎటిసలాట్‌ 25 దిర్హామ్‌లను అపరాధ రుసుము కింద వసూలు చేయనుంది. ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ సర్వీసులకు ఈ లేట్‌ పేమెంట్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే, ఎటిసలాట్‌తోపాటు యూఏఈకి చెందిన మరో టెలికాం కంపెనీ డు, ఐదు శాతం వ్యాట్‌ని తమ సర్వీసులు, ప్రోడక్ట్స్‌పై వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వ్యాట్‌ రానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. పలు రకాలైన వస్తువులు, సర్వీసులపై యూఏఈ జనవరి 1 నుంచి ఐదు శాతం వ్యాట్‌ని వసూలు చేయనున్న సంగతి తెలిసినదే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com