ఫుడ్‌ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

- November 30, 2017 , by Maagulf
ఫుడ్‌ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: ఫుడ్‌ స్టోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఫైర్‌ ఫైటర్స్‌ రంగంలోకి దిగారు. విజయవంతంగా మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్‌ ఫైటర్స్‌, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందడంతో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పిఎసిడిఎ పేర్కొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నట్లు పిఎసిడిఎ అధికారి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com