అవికా: నో మోర్ నటన..ఓన్లీ డైరెక్షన్

- December 01, 2017 , by Maagulf
అవికా: నో మోర్ నటన..ఓన్లీ డైరెక్షన్

"చిన్నారి పెళ్లికూతురు" సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి."ఉయ్యాలా జంపాల" లో రాజ్ తరుణ్ తో జత కట్టి కుర్రకారుల హృదయాలను దోచుకుంది "అవికా గోర్". తెలుగు బుల్లితెరకు ఆనందిగా పరిచయమై. అటు తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించి తనదైన నటనతో పేరు తెచ్చుకున్న అవికాగోర్ గురించి తెలియని వారుండరు. సినీ అభిమానుల కన్నా టీవీ సీరియల్ అభిమానులకే ఆమె గురించి బాగా తెలుసు.తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది ఓసారి తనకంటే పద్దెనిమిదేండ్లు పెద్దవాడితో పెళ్లికి సిద్దమవుతుందని. . మరోసారి ఇద్దరు స్టార్ హీరొయిన్స్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది..ఇప్పుడేమో సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట..!
ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల భామ కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉండేది.లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడితో కూడా అందరిని ఆకట్టుకుంది .బొద్దుగా తయారయి అవకాశాలు లేకపోవడంతో లుక్ మొత్తం మార్చేసింది. అయినప్పటికీ కూడా సినిమా అవకాశాలు రాలేదు..ఆ మధ్య టాలివుడ్ హీరో ఒకరు వేధిస్తున్నారని బాదపడి సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది.తాను నటన నుంచి వైదొలగాలనుకుంటుందట. .
 
సినిమాలకు దర్శకత్వం వహించడంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు.. ఆఫర్లు రాకపోవడంతో నటన నుంచి బ్రేక్‌ తీసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆఫర్లు రాకపోవడంతో కాదని, తాను సినిమాలను డైరెక్ట్‌ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది." నేను బ్రేక్‌ తీసుకోవడానికి ఒక కారణముంది. ఫిల్మ్‌మేకింగ్‌ స్టడీస్‌, మేకింగ్‌ ఫిల్మ్స్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నా" అని అవికా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com