28 వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శించిన శ్రీశ్రీ ఎమిర్

- December 03, 2017 , by Maagulf
28 వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శించిన శ్రీశ్రీ  ఎమిర్

దోహా: 28 వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతుంది .ఆదివారం ఉదయం శ్రీశ్రీ ఎమిర్  షేక్ టామీ బిన్ హమద్ అల్ థాని సందర్శించారు. "జ్ఞాన సమాజం వైపు" అనే నినాదంతో ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది . శ్రీశ్రీ ఎమిర్ రాక  పిల్లలలో ఎంతో ఉత్సాహం నింపింది. వివిధ వయస్సులకు చెందిన బాలబాలికలు పలు విద్యా,ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో సంతోషంగా పాల్గొన్నారు. ఈ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందచేశారు. ప్రభుత్వ సంస్థలు ,సాంస్కృతిక సంస్థల భాగస్వామ్యంతో జరిగిన ఈ ప్రదర్శనలో అరబిక్ మరియు అంతర్జాతీయ ప్రచురణ సంస్థలకు చెందిన పుస్తకాలు అదేవిధంగా తాజా ప్రచురణలు, పుస్తకాలు మరియు లిఖిత ప్రతులు ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com