అణు ప్లాంట్ పైకి క్షిపణి ప్రయోగం జరిపినట్లు హౌతీ ఆరోపణలను ఖండించిన యుఎఇ
- December 03, 2017_1512309267.jpg)
అబుదాబి : యుఎఇ లోని ఒక అణు ప్లాంట్ పైకి క్షిపణి ప్రయోగం విజయవంతంగా జరిపినట్లు హౌతీ గ్రూప్ చేస్తున్నఅసత్య ఆరోపణలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆదివారం ఖండించింది.,యూఏఈ యొక్క వాయు ప్రదేశంలో ఒక క్షిపణి ప్రయోగాన్ని యెమెన్ లోని హౌతీ సైన్యం జరిపినట్లు వామ్ అధికార వార్త సంస్థ ఒక తప్పుడు వార్తలో తెలిపింది. అయితే యుఎఇ యొక్క వాయు రక్షణ వ్యవస్థ ఎటువంటి బెదిరింపులకు తలొగ్గని శక్తీ సామర్థ్యం కలిగి ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. బరాకహ్ అణు విద్యుత్ కర్మాగారం అన్ని అవసరమైన భద్రత మరియు రక్షణ చర్యలు అప్రమత్తంగా ఉందని, ఎటువంటి సంక్షోభాన్ని సైతం నిమిషాల వ్యవధిలో నివారించడానికి జాతీయ అత్యవసర సంక్షోభం,విపత్తుల నిర్వహణ సంస్థ ( ఎన్ సి ఇ ఎం ఎ ) సదా సిద్ధంగా ఉంటుందని తెలిపింది.దేశం సురక్షితంగా ఉంటుందని మరియు దేశం తన భద్రత మరియు రక్షణను కొనసాగించాలని, శాంతి మరియు న్యాయం యొక్క విశ్వాసాలపై కొనసాగుతుందని పౌరులు మరియు నివాసితులకి జాతీయ అత్యవసర సంక్షోభం,విపత్తుల నిర్వహణ సంస్థ ( ఎన్ సి ఇ ఎం ఎ ) హామీ ఇచ్చింది. అటువంటి పుకార్లను విశ్వసించవద్దని వివరణ ఇచ్చింది. సాధారణ ప్రజలకు సలహా ఇవ్వడమే అధికారం యూఏఈ యొక్క సామర్థ్యాలను, శక్తీ మరియు భద్రతను ప్రశ్నించే తప్పుడు వార్తలను జారీచేసే మీడియా సంస్థలు ప్రసారం చేయడం విడ్డూరమని పేర్కొంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!