చారిత్రాత్మక చిత్రానికి కట్టి పట్టిన పోర్న్ బ్యూటీ

- December 03, 2017 , by Maagulf
చారిత్రాత్మక చిత్రానికి కట్టి పట్టిన పోర్న్ బ్యూటీ

బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కి బంపర్ ఆఫర్ లభించింది. ఇప్పటివరకు తాను చేయని వెరైటీ రోల్ చేయబోతోంది. ఓ హిస్టారికల్ చిత్రంలో నటించనున్న సన్నీ.. మెల్లగా తన గ్లామరస్ డోస్ తగ్గించుకుని..తెలుగు అనుష్కలా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తమిళ డైరెక్టర్ వీ.సీ.వడివుదయన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చారిత్రాత్మక చిత్రంకోసం ఆమె అప్పుడే కత్తిసాము, గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతోందని బాలీవుడ్ న్యూస్.

తెలుగు, తమిళం, హిందీ, మళయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం సన్నీ లియోన్ 150 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈమెకు మరింత ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏపీ నుంచి ఓ స్పెషల్ ట్రైనర్ ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాని పోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నాడని, ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం స్క్రిప్ట్ తనకెంతో నచ్చిందని చెబుతున్న ఈ బ్యూటీకి వెరైటీ రోల్స్ లభించడం విశేషమే మరి !

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com