విశాల్ ఎంట్రీతో హీటెక్కిన ఆర్కేనగర్ బైపోల్

- December 03, 2017 , by Maagulf
విశాల్ ఎంట్రీతో హీటెక్కిన ఆర్కేనగర్ బైపోల్

తమిళనాట ఆర్కేనగర్ ఉపఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది. విశాల్ ఎంట్రీతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తొలుత అధికార, విపక్షాల మధ్య గట్టిపోటీ వుంటుందని పార్టీలు భావించినప్పటికీ.. విశాల్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సోమవారం ఉదయం చెన్నైలోని తన మద్దతుదారులతో కలిసి ఓ టెంపుల్‌కి వెళ్లి అక్కడ ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రులైన కామరాజ్, ఎంజీఆర్, జానకీ రామచంద్రన్ విగ్రహాలను పూలమాల వేశాడు. అనంతరం ఆర్కేనగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నాడు.

కొన్నాళ్లగా తమిళనాట వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు నటుడు విశాల్. ఇటీవల నడిఘర్ సంఘం ఎన్నికలు.. విశాల్ రాకతో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

ఇదే స్పీడ్ ఆర్కేనగర్ బైపోల్‌లో కొనసాగిస్తాడా? రాజకీయాలు వేరు.. సినిమాలు వేరని ఓటర్లు నిరూపిస్తారో చూడాలి. ఇక విశాల్‌కి ధీటుగా బరిలోకి దిగేందుకు దర్శకుడు, నటుడు అమీర్‌. ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు వేయనున్నాడు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మదుసూదనన్, డీఎంకే అభ్యర్థిగా మరుదుగణేశ్, అన్నాడీఎంకే అమ్మ (రెబల్‌) గా టీటీవీ దినకరన్‌ పోటీ చేస్తుండగా, ఇక బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com