జనవరి 26 న విష్ణు మంచు ‘ఆచారి అమెరికా యాత్ర’ !

- December 04, 2017 , by Maagulf
జనవరి 26 న విష్ణు మంచు ‘ఆచారి అమెరికా యాత్ర’ !

'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానుంది. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా విడుదల తేదీని నేడు ప్రకటించారు నిర్మాతలు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు;
ఇతర తారాగణం:
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్ సింగ్
సాంకేతిక వర్గం: రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి, ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్, ఎడిటింగ్: వర్మ , సంగీతం: ఎస్ ఎస్ థమన్, మాటలు: డార్లింగ్ స్వామి, ఆర్ట్ : కిరణ్ , యాక్షన్ : కనాల్ కన్నన్,  
బ్యానర్ : పద్మజ  పిక్చర్స్ , సమర్పించు : ఎంఎల్ కుమార్ చౌదరి, నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com