పక్క భాషలోకి 'బ్రహ్మోత్సవం'
- December 05, 2017
చెన్నై: మహేష్‌బాబు, కాజల్‌అగర్వాల్, సమంత, ప్రణీత తదితరులు నటించిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. చిత్రా ఎంటర్టైన్మెంట్ సమర్పణలో భద్రకాళి ప్రసాద్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెల్వందన్, ఇదుదాండా పోలీస్, మగధీర, బ్రూస్లీ, ఎవండా.. వంటి పలు చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని 'అనిరుధ్' పేరుతో అనువాదం చేస్తున్నారు. సత్యరాజ్, నాజర్, రేవతి, షియాజిషిండే, జయసుధలు ఇతర తారాగణం. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. కంభంకర్ణ, వెంకటేశన్, అంబికా కుమరన్, తిరుమలై సోము, యువకృష్ణ, రాజాలు పాటలు రాశారు. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమిళంలో ఏఆర్కే రాజరాజా మాటలు రాశారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ''ఇదో కుటుంబ కథా చిత్రం. కుటుంబసభ్యులు, బంధువులందరూ కలసి కూర్చుని చూడదగ్గ సినిమా.
ఇలాంటి వాటికి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. తమిళంలో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. దీపావళి, పొంగల్ వంటి పండుగలన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అలాంటి అనుభూతి కలుగుతుంద''ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!