భారీ బడ్జెట్ తో వస్తున్నా సైఫ్ కూతురు

- December 05, 2017 , by Maagulf

బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టేసింది. ఎట్ ప్రజెంట్ కేదార్‌నాథ్ ఫిల్మ్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకువచ్చింది.
కొంతపార్ట్ ఇటీవల ఉత్తరాఖండ్లో షూట్ చేశారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం పెద్దఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్. కేదార్‌నాథ్ టెంపుల్ తరహాలోనే భారీ సెట్‌ని ముంబైలోని ఓ ఫిల్మ్ సిటీలో నిర్మించారు. ఈ సెట్ గురించి యూనిట్ సభ్యులే రకరకాలు మాట్లాడుకుంటున్నారు.
 
భారీ వరదలు ముంచెత్తి టెంపుల్ మునిగి సీన్లను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లను రప్పించారు. నాలుగేళ్ల కిందట ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీ మూవీగా చెబుతున్నారు యూనిట్ సభ్యులు.
 
ఈ చిత్రం కోసం ప్రొడ్యూసర్ బాగానే ఖర్చు చేస్తున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. సారా పక్కన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. మొత్తానికి వచ్చేఏడాది ఓ వైపు జాన్వికపూర్, మరోవైపు సారా అలీఖాన్లు తమతమ సినిమాలతో వెండి ప్రేక్షకులను అలరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com