గూగుల్ మ్యాప్స్‌లోకి వచ్చిన 'మోటార్ సైకిల్'
- December 05, 2017
ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలన్నా, మనం వెళ్దామనుకునే రూట్‌లో ట్రాఫిక్ చూద్దామన్నా, మనకు సమీపంలో కాఫీ షాప్‌లు, పెట్రోల్ బంక్‌లు, థియేటర్లు... ఇలా దేని అడ్రస్ కావాలన్నా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాల్సిందే. అంతగా గూగుల్ మ్యాప్ మన జీవితంలో మమేకం అయిపోయింది. అయితే ఇక్కడ ఒకటే సమస్య... ఏదైనా ప్రాంతానికి రూట్ చూద్దామంటే కారు, బస్, క్యాబ్, నడక (వాకింగ్) మోడ్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ బైక్‌లో వెళ్లాలన్నా కారు మోడ్‌ను ఆన్ చేసుకోవాలి. దీని వల్ల ఒక్కోసారి ఆ రూట్ ఔటర్ రింగ్ రోడ్‌ను, ఎక్స్‌ప్రెస్ హైవేను చూపిస్తుంది. అలాంటి దారుల్లో బైక్ మీద వెళ్లలేం. చాలా రోజుల నుంచి ఉన్న ఈ ఇబ్బందిని గూగుల్ తొలగించింది.
'మ్యాప్స్'లో మోటార్ సైకిల్ మోడ్‌ను తీసుకొచ్చింది. ఇది కార్ మోడ్ తరహాలోనే పని చేస్తుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్లు 'టూవీలర్ మోడ్‌లో' చూపించవు.
తరుచుగా మ్యాప్స్ వాడి ప్రయాణించేవారికి ఈ ఆప్షన్ ఉపయుక్తంగా ఉంటుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!