అడ్డగోలుగా మాట్లాడినా... ఆర్జీవీ జెంటిల్ మెన్ : స్వాతి

- December 06, 2017 , by Maagulf
అడ్డగోలుగా మాట్లాడినా... ఆర్జీవీ జెంటిల్ మెన్ : స్వాతి

బుల్లి తెరపై యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకొన్న స్వాతి.. వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టింది. స్వాతి హీరోయిన్ గా నటించింది.. తక్కువ సినిమాలే.. కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న స్వాతి వివాదాల వర్మ గురించి పలు ఆసక్తి కరమైన విషయాలను చెప్పింది. వర్మ సినిమాలో మీరు నటించారు కదా.. ఆయనతో మీ జర్నీ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి అని అడిగిన ప్రశ్నకు స్వాతి ఇచ్చిన సమాధానం... "నేను ఇప్పటి వరకూ చేసిన దర్శకుల్లో ఎలాంటి ఇబ్బంది పెట్టని గొప్ప దర్శకుడు వర్మ... ఆయన నన్ను రేవతి తో పోల్చారు.. నటన విషయం లో ఎక్కువగా ఆలోచించవద్దు.. సహజంగా నటించమని ఆయన సలహా ఇచ్చారు.. అంతేగానీ ఆయన తన గీతను ఎప్పుడూ దాటలేదు.. హీ ఈజ్ ఏ జెంటిల్మెన్.." అని కితాబు ఇచ్చింది స్వాతి. అవును తన వివాదాస్పద వ్యాఖ్యలతో.. అడ్డగోలుగా మాట్లాడే వర్మ.. చేసే ట్విట్స్ తో ఆయనకు ఆడవాళ్ళ పిచ్చి అనే ఓ అభిప్రాయం పడిపోయింది కానీ.. ఆయనా ఇన్నేళ్ల కెరియర్ లో ఏ ఒక్క హీరోయిన్ కూడా వర్మ గురించి చెడుగా చెప్పలేదు.. అడ్డగోలుగా మాట్లాడినా... ఆర్జీవీ జెంటిల్ మెన్ అనే విషయం కలర్స్ స్వాతి కూడా ధృవీకరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com