సినిమాల్లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న జెనీలియా..!!
- December 06, 2017
పెళ్లి అయ్యాక హీరోయిన్స్ కొంతకాలం వెండి తెరకు దూరంగా ఉండి.. అనంతరం మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.. కానీ హీరోయిన్ నుంచి రిటైర్ అయ్యి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి.. హవా కొనసాగిస్తున్నారు.. నదియా, రమ్యకృష్ణ, మీనా, వంటి వారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి.. మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు.. కాగా తాజాగా పెళ్లయ్యి.. ఇద్దరు పిల్లల తళ్ళైన జెనీలియా మళ్ళీ వెండి తెరపై కనిపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది..
దక్షిణాది సినిమాల్లో జెనీలియా మంచి హీరోయిన్ గా రాణించింది.. రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది.. కాగా పిల్లలు కొంచెం పెద్దవారు కావడంతో.. తాను మళ్ళీ సినిమాల్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకొంటుంది.. ఇటీవల ముంబై లో జరిగిన ఓ కార్యక్రమం లో జెనీలియా తాను మళ్ళీ సినిమాల్లోకి వస్తానని ప్రకటించింది.. దక్షిణాది సినిమాలతో పాటు.. మరాఠి సినిమాలో కూడా నటించడానికి ప్రణాళిక సిధ్ధం చేసుకొన్నట్లు చెప్పింది. రానా హీరో తెరకెక్కిన నా ఇష్టం సినిమా 'జెనీలియా' కు లాస్ట్ సినిమా. సై, బొమ్మరిల్లు, ఆరెంజ్, శశిరేఖ పరిణయం, నా ఇష్టం, హ్యాపీ వంటి తెలుగు సినిమాల్లో నటించియాన్ జెనీలియా పెళ్లి అయిన తర్వాత రెండు హిందీ సినిమాలు.. ఓ మరాఠి సినిమాలో గెస్ట్ రోల్ లో మాత్రమే నటించింది. కాగా జెనీలియా సినిమాల్లో రీ ఎంట్రీ .. హీరోయిన్ గానా.. లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగానా.. లేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనా అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల