'ఛలో' చిత్రం ఫస్ట్ సాంగ్ గ్రాండ్ లాంచ్
- December 06, 2017
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణవైభోగం”,” జ్యోఅచ్చుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగశౌర్య. ఈ ఎనర్జిటిక్ హీరో త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఛలో చిత్రంలోని చూసి చూడంగానే అనే సాంగ్ ను లాంచ్ చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతమందించారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ... ఫస్ట్ సాంగ్ లాంచ్ కార్యక్రమం రిసెప్షన్ ఫంక్షన్ లా అనిపిస్తోంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ చాలా థాంక్స్. చూసి చూడంగానే అనే ఈ సాంగ్ ని మహతి స్వర సాగర్ కంపోజ్ చేశారు. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ. భాస్కర భట్ల గారు సాహిత్యం అందించారు. నాగశౌర్య, రష్మిక మండన్న ఈ సాంగ్ లో చాలా అందంగా కనిపిస్తారు. ఈ పాటకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. యూట్యూబ్ లో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే పాజిటివ్ కామెంట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. గుంటూరు ఏసి కాలేజ్ లో ఈ సాంగ్ షూట్ చేసాం. డీ మానటేషన్ టైంలో అసలు ఇండస్ట్రీలో సినిమాలే తీయరని చాలా భయపెట్టారు. డిప్రెషన్ లోకి వెళ్లాను. కానీ నేను అదే టైంలో ఛలో కథ చెప్పాను. నా కథ నచ్చి ఎన్ని సమస్యలున్నా ఈసినిమా చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్న నిర్మాతలకు నేను రుణపడి ఉంటాను. అడిగిన దానికంటే చాలా ఎక్కువగా ఇచ్చారు. చాలా హ్యాపీ. అని అన్నారు.
నటీనటులు - నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు.. నిర్మాత- ఉషా ముల్పూరి, సమర్పణ - శంకర ప్రసాద్ ముల్పూరి, దర్శకత్వం- వెంకి కుడుముల
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల