'ప‌డిపోయా నీ మాయ‌లో' ఆడియో విడుదల

- December 06, 2017 , by Maagulf
'ప‌డిపోయా నీ మాయ‌లో' ఆడియో విడుదల

శ్రీరాజన్న మూవిస్. మహెష్ ఎంటర్ ట్రెన్ మెంట్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ప‌డిపోయా నీ మాయ‌లో`. అరుణ్ గుప్తా, సావేరి, జ‌య‌వ‌ర్ధ‌న్ తారాగ‌ణంగా న‌టించారు. ఆర్‌.కె.కాంప‌ల్లి ద‌ర్శ‌కుడు. మ‌హేష్ పైడ‌, భ‌ర‌త్ అంక‌తి నిర్మాత‌లు. జ‌య‌వ‌ర్ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేంద‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. తొలి సీడీని ఎన్‌.శంక‌ర్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ - ``సినిమారంగం కొన్ని కుటుంబాల‌కే ప‌రిమిత‌మై పోతున్న ఈరోజుల్లో తెలంగాణ యువ‌త సినిమా తీయ‌డానికి ముందుకు రావ‌డం గొప్ప ప‌రిణామం. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత సినిమా ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌లో అంత‌రించి పోతుంద‌ని చాలా మంది అన్నారు. కానీ అవాస్త‌వ‌మ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిరూపించింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు చేయూత‌నిచ్చింది. ఇప్పుడు చాలా రకాల సినిమాల‌కు హైద‌రాబాద్ కేంద్రంగా మారింది. ఒక‌ప్పుడు తెలంగాణ వారికి త‌ప‌న ఉన్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవు. అంత‌టా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన వారంతా క‌లిసి ప‌డిపోయా నీ మాయ‌లో అనే సినిమా తీయ‌డం అభినంద‌నీయం. ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించి అంద‌రికీ మంచి పేరుని తెచ్చిపెట్టాలి`` అన్నారు. 
ఎన్‌.శ‌కంర్ మాట్లాడుతూ ``ల‌ఘు చిత్రాలు తీసిన ద‌ర్శ‌కుడు కాంప‌ల్లి ఓ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌డిపోయా నీ మాయ‌లో సినిమా చేయ‌డం అభినంద‌నీయం. ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ను సాధించి యూనిట్‌కు మంచి పేరు తేవాలి`` అన్నారు. 
ఫణిదర్, రాధకృష్ణ,భరత్ అంకతి,మల్లికార్జున్,రాధరపుప్రభాకర్,పుర్ణచందర్, మల్లేషం, శివ, ఆశ్విని,నేహ,మహేష్ పైడ,వేణు నాగుల,చంద్రశేఖర్,రమేష్ అరె తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః జ‌య‌వ‌ర్ధ‌న్‌, పాటలరచయితలుః నరేష్ చైతన్య,వీరు, గాయకులుః గీతమాదురి, మాలవిక,హైమద్,జయవర్దన్, డి.ఓ.పి...విక్రమ్ తలశిల‌, ఫెట్స్ః రాజు మద్దురి, ఎడిటర్ః గోపి సిందం, నిర్మాతలు...మహెష్ పైడ,భరత్ అంకతి, కథ,మాటలు,స్రీన్ ప్లె,దర్శకత్వం.....ఆర్ కె కాంపల్లి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com