భాగ్యనగరం లో నిక్కర్ బ్యాచ్ హల్ చల్..!

- December 08, 2017 , by Maagulf
భాగ్యనగరం లో నిక్కర్ బ్యాచ్ హల్ చల్..!

హైదరాబాద్: ఈ మద్య దొంగలు రక రకాలుగా వ్యూహాలు పన్నుతూ అందినంత దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో నిక్కర్ బ్యాచ్ అడుగుపెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుల్లో సైతం కలవరం మొదలైంది. సుమారుగా 4 నుంచి 10 మంది కలసి ఓ ముఠాగా సంచరిస్తుంటారు. పగటి పూట బెలూన్లు, ఇతర ఆట వస్తువులను విక్రయిస్తూ తాళం వేసి ఉన్న సంపన్నుల ఇళ్ల సమాచారాన్ని ముఠాలోని మహిళా సభ్యులు పసిగడతారు. రాత్రి వేళల్లో ఆ ఇళ్లలో చోరీలు చేస్తూ అందినంత దోచుకుంటున్నారు.
వీరు తమ వెంట కత్తులు, ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో సంచరిస్తుంటారని పేర్కొంటున్నారు. ఏమీ లేకపోతే చివరికి రాళ్లదాడికి సైతం వీరు వెనుకాడరు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత లోపల ఎవరైనా ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే వారిని భయపెట్టి తాళ్లతో కట్టేయడం దాడి చేయడం..అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే మియాపూర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈ ముఠా సంచరిస్తోంది.
ఈ ప్రాంతంలో పలు చోరీలు జరగ్గా, దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు పలు అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే విషయం వెలుగు చూసింది. మరోవైపు పోలీసులు రాత్రి వేళల్లో ఓంటరి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు నగరంలోని అన్ని కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com