డిసెంబర్ 22న "ఇ ఈ".. సినిమా విడుదల
- December 09, 2017
నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా నటించిన చిత్రం ‘ఇ ఈ’. రామ్ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మమ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ చేతన్ టీఆర్ స్వరాలందించారు. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు, నిర్మాత ప్రకటించారు.
నిర్మాత లక్ష్మణ రావ్ మాట్లాడుతూ.... ఇ ఈ ... చిత్రం సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. డిసెంబర్ 22న ఇ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. రామ్ గణపతి రావు ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ సీన్స్ ని చాలా బాగా చూపించారు. తప్పకుండా టాలీవుడ్ లో కొత్త చిత్రం అవుతుంది. అని అన్నారు.
ధర్శకుడు రామ్ గణపతి రావ్ మాట్లాడుతూ... నేను చాలా సంవత్సరాలుగా యానిమేషన్ రంగంలో ఉన్నాడు. యానిమేటర్ గా దాదాపు 400 ఎపిసోడ్స్ చేశాను. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాను. ఇ ఈ చిన్న సినిమా కాదు. మేం పెద్ద సినిమాగానే భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగు సినిమా స్క్రీన్ మీద ఇలాంటి సినిమా కథ రాలేదు.ఆ విషయాన్ని ప్రౌడ్ గా చెప్పగలను. కొత్త కథ చూడాలి అని కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ కథ రాయడమే కాదు.. చాలా కష్టపడి చేశాం. నాకు డైరెక్షన్ ఎక్స్ పీరియెన్స్ లేదు. ఎవ్వరి దగ్గరా పనిచేయలేదు. కానీ కథను నమ్మాం. విజువల్స్ చూస్తే చిన్న సినిమా అనిపించదు. మేం ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అంతమంది చూడడమనేది మా మొదటి సక్సెస్. ప్లీజ్ ఈ సినిమాను డిసెంబర్ 22న చూడండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా కంటతడి పెట్టుకుంటారు. సీినియర్ నటుడు సుధాకర్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఈ మూవీ అందర్నీ హ్యాపీగా ఉంచుతుంది. అని అన్నారు.
హీరో నీరజ్ శ్యామ్ మాట్లాడుతూ... రియల్లీ హ్యాపీ అండీ. మీడియా నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. కొత్త వాళ్లు చేసిన సినిమా ట్రైలర్ కు 1.5 మిలియన్ వ్యూస్ రావడమనేది చిన్న విషయం కాదు. ట్రైలర్ అంతగా వైరల్ అయ్యింది. ఎమోషన్స్ బాగా పండిందంటున్నారు. మ్యూజిక్, బాగా నచ్చింది అందరికీ. ట్రైలర్స్ ఫుల్ మీల్స్ లా ఉంది అంటున్నారు. డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నాం. టోటల్ గా డిఫరెంట్ మూవీ. తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి సినిమాచూసి ఉండరు.
హీరోయిన్ నైరా షా మాట్లాడుతూ... డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థాక్స్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గ్లామర్ పరంగా యాక్టింగ్ పరంగా నాకు మంచి పేరు తెస్తుంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అని అన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!