బాలీవుడ్ నటి జైరా వసీమ్ కు లైంగిక వేధింపులు
- December 09, 2017
దంగల్ నటి జైరా వసీమ్ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో ఓ ప్యాసెంజర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి తన కాలితో జైరా వీపు, మెడ భాగాల్లో పదేపదే రుద్దాడు. తట్టుకోలేని విధంగా అతను, వెకిలిగా ప్రవర్తించాడని చెప్తోంది. విస్తారా ఫ్లైట్‌లో తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జైరా. ఏడుస్తూ ఆ అమ్మాయి పెట్టిన వీడియో మెసేజ్.. క్షణాల్లోనే ఇది వైరల్ అయ్యింది.
తనను వేధించిన వ్యక్తి ఫొటో తీసేందుకు ట్రై చేశానని, ఐతే డిమ్ లైటింగ్ కారణంగా కుదరలేదని జైరా చెప్పుకొచ్చింది. కంటిన్యూగా అతను తన కాలితో అలా రుద్దుతూనే ఉన్నాడని కన్నీరుపెట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై విస్తారా ఎయిర్‌లైన్స్ స్పందించింది. దీనిపై విచారణ జరిపి, ఆ ప్యాసెంజర్ ఎవరు, అసలేం జరిగిందో తేలుస్తామని చెప్పింది. జైరాకు పూర్తి మద్దతు ప్రకటించింది. అటు, ఈ ఘటనపై ఇంత వరకూ పోలీస్ కేసు నమోదు కాలేదు. కానీ, ఫ్లైట్‌లో వేధించిన వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
జైరా తీసిన వీడియోలో అతను కాలితో టచ్ చేసేందుకు ట్రై చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ధైర్యం చేసి ఫొటో తీద్దామనుకున్నానని, కానీ కుదరలేదని చెప్పింది. 17 ఏళ్ల జైరా దంగల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమీర్ ఖాన్ కూతురిగా కనిపించి, యాక్టింగ్‌కి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ అమ్మాయి ఇప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కోవడం సంచలనంగా మారింది. నిన్న రాత్రి తనకు జరిగిన అవమానం, వేధింపులపై జైరా సోషల్ మీడియాలో పెట్టింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!