ఒక్కటవ్వనున్న విరాట్ అనుష్క
- December 10, 2017
ఢిల్లీ : ఎన్నాళ్లో వేచిన కల నెరవేరబోతుంది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట ఒక్కటి ఈ నెల 12న ఒకటి కాబోతున్నారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిపై ఎంతో కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నా.. తాజాగా వారిద్దరు ఈ వారంలో ఒకటి కాబోతున్నారు.. కల్యాణ ఘడియలు దగ్గర పడుతుండటంతో.. కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇటలీలోని మిలాన్‌కు పయనమయ్యారు.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైంది. ఈనెల 12న వీరి వివాహం ఇటలీలోని మిలన్‌లో జరుగనుంది. ఈ ప్రేమ జంట ఇప్పటికే ఇటలీలోని మిలాన్‌కు చేరుకున్నారు. వీరి వివాహం అక్కడి ప్రఖ్యాత వైన్‌యార్డులో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విరాట్, అనుష్కలు వేర్వేరుగా తమ సన్నిహితులను కూడా వెంట పెట్టుకుని మిలన్‌కి చేరుకున్నారు. ఇక సెలెబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అనుష్క వివాహ దుస్తులను డిజైన్ చేయగా,.. మేకప్ ఆర్టిస్టులు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లను కూడా మిలాన్‌కు తీసుకెళ్లారు. అనుష్క కుటుంబ పూజారి మహరాజ్ అనంత బాబా కూడా వీరితో పాటు... మిలాన్ వెళ్లారు.
విరాట్..అనుష్క జంట కొంతమందికే ఆహ్వానించినట్లు తెలిసింది. అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న కోహ్లీ, అనుష్కల వివాహానికి అతిథులు ఎవరనేదా నిపై స్పష్టత లేకపోయినా బ్యాటింగ్ దిగ్గజం సచిన్, యువరాజ్ సింగ్‌లకు ఆహ్వానం దక్కినట్టు సమాచారం. మరోవైపు అనుష్క తన తొలి హీరో షారుఖ్‌తో పాటు ఆమిర్, డైరెక్టర్లు ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మను కూడా ఆహ్వానించింది.
అనుష్క శర్మ నివాసముండే అపార్ట్‌మెంట్ వాసులకు కూడా పెళ్లి ఆహ్వానం అందింది. కానీ వీరిలో కొందరికే ఇటలీ వెళ్లే అవకాశముందట. కోహ్లీతో తన కూతురు వివాహం జరుగుతుందని, ముంబైలో జరిగే రిసెప్షన్‌కు అంతా రావాలంటూ అనుష్క తండ్రి స్వయంగా ఆహ్వానించారని అపార్ట్‌మెంట్ వాసులు సంతోషంతో తెలిపారు.
ఇటలీలోని టస్కనీ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లో శనివారం నుండి పెళ్లికి ముందు జరిగే ఇతర వేడుకలు జరుగుతున్నాయి. ఎటుచూసినా పచ్చని మైదానాలతో పాటు చక్కటి ల్యాండ్‌స్కేప్‌లకు ఈ ప్రాంతం పెట్టిన పేరు. అయితే పెళ్లి మాత్రం మిలాన్‌లోని ఖరీదైన హోటల్‌లో జరిగే అవకాశముంది. మరోవైపు వీరిద్దరి వివాహం ఈనెల 12న కాదు 15న జరుగుతుందని కొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నో రోజులుగా కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రచారానికి ఈ వారంలో తెరపడనుంది. ఇండియాలో కాకుండా ఇటలీలో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!