రేపట్నుంచే దుబాయ్ సఫారీలోకి ప్రవేశం
- December 10, 2017
దుబాయ్:రేపే, అంటే డిసెంబర్ 12న సఫారీ పార్క్ సందర్శకులకోసం తెరచుకోనుంది. దుబాయ్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. లీజర్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలెద్ అల్ సువైది మాట్లాడుతూ, సఫారీ పార్క్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంటుందని చెప్పారు. ఇందులో 2,500 జంతువులు, 250 ఇతర జీవాలు ఉంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వీటిని తీసుకొచ్చారు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించారు. మూడేళ్ళ లోపు చిన్నారులకు, 60 ఏళ్ళ పైబడ్డ వృద్ధులకు ప్రవేశం ఉచితం. మూడేళ్ళ పైబడ్డ పిల్లలకు 30 దిర్హామ్‌లు, పెద్దలకు 85 దిర్హామ్‌లు టిక్కెట్ వసూలు చేయబడుతుంది. సఫారీ కాదనుకుంటే పిల్లలకు 20, పెద్దలకు 50 దిర్హామ్‌లు చెల్లించాలి. 2020 నాటికి సఫారీ పార్క్‌లో మొత్తం జంతువుల సంఖ్య 5,000కి చేరనుందనీ, రోజుకి 10,000 మంది విజిటర్స్‌కి వీలుగా సఫారీ పార్క్‌ని రూపొందించామని అల్ సువైది చెప్పారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







