ఉబర్ క్యాబ్స్పై సంస్థ పై భారతీయ మహిళ కేసు
- December 10, 2017
వాషింగ్టన్ : ఉబర్ క్యాబ్స్ సంస్థపై ఓ భారతీయ మహిళ అమెరికా కోర్టులో కేసు నమోదు చేసింది. ఉబర్ క్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీసుల నుంచి తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకున్నాడని, తద్వారా తన వ్యక్తిగత సమాచారం బహిర్గత మైందని కోర్టులో మహిళ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉబర్ యాజమాన్యానికి భారీ జరిమానా విధించిందని ప్రాసిక్యూష న్ వెల్లడించింది. ఎంత జరిమానా విధించిందో మాత్రం స్పష్టం చేయలేదు. కాగా, 2014లో ఢిల్లీలో 26ఏండ్ల మహిళపై లైంగికదాడి జరిగిన సంగతి తెలిసిందే. శివరామ్‌కుమార్ అనే ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం శివరామ్‌ని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. లైంగికదాడి బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపిన రిపోర్ట్‌ను ఉబర్ క్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీసుల వద్ద నుంచి తీసుకున్నాడు. దీంతో, ఆ మహిళ అమెరికాకు వచ్చి ఉబర్ క్యాబ్స్ సంస్థపై కేసు నమోదు చేసింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







