ఇండియా లో 2023 వరల్డ్ కప్.!
- December 11, 2017
ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. 2023 వన్డే వరల్డ్ కప్‌ను భారత్‌లో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐ సర్వసభ్య సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించింది.
దీంతో తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2023లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్‌తోపాటు 2021 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌లో నిర్వహించబోతున్నారంట. ఇక గతంలో పలుసార్లు భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ లు జరిగాయి.
అయితే, ఆయా మ్యాచ్‌లకు భారత్ పూర్తి స్థాయి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇతర దేశాలతో కలిసి వేదికను పంచుకుంది. 1987, 1996, 2011 లలో భారత్ వరల్డ్ కప్‌ను నిర్వహించింది. 1983, 2011లో భారత్ కప్‌లను కైవసం చేసుకుంది. దీంతోపాటు 2019-23 సంవత్సరాల కాలంలో భారత్ స్వదేశంలో మొత్తం 81 మ్యాచ్‌లు ఆడబోతుందని బీసీసీఐ వెల్లడించింది. 2019 ఐసీసీ వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!