కమెడియన్ విజయ్ ఆత్మహత్య లో మరో కోణం
- December 11, 2017
టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో విజయ యూసఫ్ గూడ లోని తన ప్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న సంగతి విధితమే..విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు..కాగా విజయ్ తండ్రి సుబ్బారావు తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు వనితా వేధింపులే కారణం అని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వనిత ఆమె తరపు న్యాయవాది తో పాటు మరొక వ్యక్తి పై కూడా కేసు నమోదు అయ్యింది. ఎఫ్ ఐ ఆర్ లో న్యాయవాది శ్రీనివాస్ వనిత తో పాటు మరో వ్యక్తి పేరు చేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులు.. విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరితో మాట్లాడాడు.. ? ఎవరిని కలిశాడు..? అనే కోణం లో విచారణ చేస్తున్నారు.. విజయ్ సెల్ఫీ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించమని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు... అయితే విజయ్ భార్య వనిత .. తన పై వస్తున్న ఆరోపణలు నిరాధారం అని.. తాను రెండు ఏళ్లుగా విడిగా ఉంటున్నట్లు చెప్పింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







