ఇండియా లో 2023 వరల్డ్ కప్.!

- December 11, 2017 , by Maagulf
ఇండియా లో 2023 వరల్డ్ కప్.!

ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ను భారత్‌లో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐ సర్వసభ్య సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించింది.  

దీంతో తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2023లో వన్డే ఇంటర్నేషనల్‌ వరల్డ్‌కప్‌తోపాటు 2021 ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా భారత్‌లో నిర్వహించబోతున్నారంట. ఇక గ‌తంలో ప‌లుసార్లు భార‌త్‌లో క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ లు జ‌రిగాయి. 

అయితే, ఆయా మ్యాచ్‌ల‌కు భార‌త్ పూర్తి స్థాయి ఆతిథ్యం ఇవ్వ‌లేదు. ఇత‌ర దేశాల‌తో క‌లిసి వేదికను పంచుకుంది. 1987, 1996, 2011 లలో భారత్‌ వరల్డ్‌ కప్‌ను నిర్వహించింది. 1983, 2011లో భారత్‌ కప్‌లను కైవసం చేసుకుంది. దీంతోపాటు 2019-23 సంవత్సరాల కాలంలో భారత్‌ స్వదేశంలో మొత్తం 81 మ్యాచ్‌లు ఆడబోతుందని బీసీసీఐ వెల్లడించింది. 2019 ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఇంగ్లాండ్‌లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com