పేద, మద్యతరగతి ప్రజలకు గృహ సదుపాయం కల్పించనున్న సౌదీ ప్రభుత్వం

- December 12, 2017 , by Maagulf
పేద, మద్యతరగతి  ప్రజలకు గృహ సదుపాయం కల్పించనున్న సౌదీ ప్రభుత్వం

సౌదీ అరేబియా: ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్న సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణలు అమలు జరపబోతున్నామని సౌదీ ప్రభుత్వం  ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున ఆయిల్ ఎగుమతుల్ని జరగనీయకుండా నిలువరించింది. దాంతో ఎన్నో చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే పేద, మద్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెబుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేద, మద్యతరగతి వారికి గృహ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిసెంబర్‌లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నామని ప్రభుత్వం చెబుతోంది. నగదు రూపంలో ఇంటి యజమానికి ప్రభుత్వం హౌజింగ్ అలవెన్స్ చెక్  అందిస్తుందని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com